Mega Princess: మెగా ఫ్యామిలీలోకి మూడోతరం వారసురాలు అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇలా మెగా వారసురాలు మెగా ఫ్యామిలీలోకి రావడంతో కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విధంగా రాంచరణ్ ఉపాసన దంపతులు బిడ్డకు జన్మనివ్వడంతో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వేల్లు వెత్తాయి.

ఇక మెగా ప్రిన్సెస్ ఎలా ఉంటుంది ఎవరి పోలికలతో ఉన్నారనే విషయాలు తెలుసుకోవాలని బుల్లి మెగా వారసురాలిని చూడాలన్న ఆత్రుత ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈ క్రమంలోనే మెగా ప్రిన్సెస్ అంటూ సోషల్ మీడియాలో ఓ చిన్నారి ఫోటో వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ ఫోటోపై ఎంతోమంది స్పందిస్తూ చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
అయితే ఈ ఫోటోలో ఉన్నది నిజంగానే మెగా వారసు రాలేనా అంటూ కొందరు సందేహాలను కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై మెగా ఫ్యామిలీకి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వారు స్పందించారు. రామ్ చరణ్ ఉపాసన కుమార్తె అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఫోటోలో ఉన్నది నిజమైన మెగా ప్రిన్సెస్ కాదని తెలియజేశారు. ఇప్పటివరకు మెగా ప్రిన్సెస్ ఫోటో ఎక్కడ రివిల్ చేయలేదని తెలిపారు.

Mega Princess: త్వరలోనే రివీల్…
మెగా ఫ్యామిలీ మెగా ప్రిన్సెస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని త్వరలోనే ఆమెను సోషల్ మీడియా వేదికగా చాలా గ్రాండ్ గా అభిమానులకు పరిచయం చేయబోతున్నారు అంటూ మెగా ఫ్యామిలీకి సంబంధించిన సన్నిహితులు రాంచరణ్ కూతురి విషయంలో ఆమె గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు.

































