టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిరంజీవి దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తోంది. అయితే ఒక వైపు సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరొకవైపు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిరు పుట్టిన రోజున భోళాశంకర్ సినిమా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. తమిళం వేదాళం సినిమాకు తెలుగు రీమేక్ గా బోళా శంకర్ సినిమా రాబోతోంది. అయితే ఈ బోళా శంకర్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ రాలేదు.
తాజాగా మెగా స్టార్ అభిమానులకు భోళాశంకర్ సినిమా నుంచి సర్ ప్రైజ్ ను ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చి రూమర్స్ కి చెక్ పెట్టేసారు.వచ్చే నెల నవంబర్ 11న ఉదయం 7:45 నిమిషాలకు ఈ సినిమా పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు గా నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది. అలాగే నవంబర్ 15 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
The Auspicious Day is Set for the MEGA LAUNCH ✨
— AK Entertainments (@AKentsOfficial) October 27, 2021
MEGA ???? @KChiruTweets – @MeherRamesh Film #BholaaShankar ???? Muhurtam Ceremony will be held on 11-11-21, 7:45AM ????
Mega Shoot Begins from 15-11-21????@KeerthyOfficial @AnilSunkara1 #MahatiSwaraSagar @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/6GuN6Zkqez
ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు మహతి సర్వ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలు కాజల్ హీరోయిన్ గా నటించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తోంది.






























