Megastar Chiranjeevi: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంటారు. అయితే సెలబ్రిటీలు ఏదైనా కార్యక్రమం నిమిత్తం బయటకు వచ్చినప్పుడు అభిమానుల దృష్టి మొత్తం వారు ధరించిన దుస్తులు వస్తువుల పైనే ఉంటుంది.ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు ఎంతో ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ధరించడం మనం చూస్తుంటాము అయితే ఈ వస్తువుల ధర కొన్ని లక్షల విలువ చేయడం గమనార్హం.

ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే సెలబ్రిటీలు ఇలా లక్షల విలువచేసే బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం అయితే ఈ విషయం మాత్రం అభిమానులకు కాస్త షాకింగ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇదివరకే ఎంతో మంది సెలెబ్రిటీలు కాస్ట్లీ వాచ్, షూస్ ధరించడం మనం చూస్తున్నాము. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి వరుస ఈవెంట్లలో పాల్గొనడంతో అందరి దృష్టి ఈయనపై పడింది.
ఇలా ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ వివిధ రకాల వాచులతో మెగాస్టార్ సందడి చేస్తున్నారు. అయితే ఈయన ధరించే వాచీల ధర ఎంత అనే విషయంపై ప్రతి ఒక్కరు దృష్టి సారిస్తున్నారు. చిరు ధరించే వాచ్ లలో రోలెక్స్ వాచ్ అత్యంత ఖరీదైనదని తెలుస్తోంది.రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ కాస్ట్ రూ. కోటి 86 లక్షల 91 వేల రూపాయల విలువ చేస్తుందని తెలిసి ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు.

Megastar Chiranjeevi: కోట్లు విలువ చేస్తున్న మెగాస్టార్ వాచీలు..
ఈ వాచ్ తో పాటు చిరంజీవి ఎ లాంగే అండ్ సోహ్నే వాచ్ కూడా ధరిస్తారని దీని ఖరీదు రూ.33 లక్షలకు పైనే అని తెలుస్తోంది. ఇలా చిరంజీవి ధరించే ఈ వాచ్ ల ధర తెలిసి ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే సెలబ్రిటీలు ఈ స్థాయిలో బ్రాండెడ్ వస్తువులను మెయింటైన్ చేయడం సర్వసాధారణమని చెప్పాలి.