నెలకు రూ.1000 పెట్టుబడితో కోటీశ్వరులయ్యే ఛాన్స్.. ఎలా అంటే..?

0
95

మనలో చాలామంది ప్రస్తుతం సంపాదిస్తున్న మొత్తం కంటే ఎక్కువ మొత్తం ఆదాయం సంపాదిస్తే విలాసవంతమైన, సంతోషంతో కూడిన జీవనం పొందవచ్చని భావిస్తుంటారు. కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించాలని రిస్క్ ఉన్న స్కీమ్స్ లో పెట్టుబడులు పెట్టి నష్టపోతూ ఉంటారు. అయితే ఇతర స్కీమ్స్ తో పోల్చి చూస్తే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించే అవకాశం ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ను ఎంచుకుని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. నెలకు 1,000 రూపాయల చొప్పున 40 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు కావచ్చు. 1000 రూపాయలు తక్కువ మొత్తమే కాబట్టి సులభంగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.

వార్షిక రాబడిని 12 శాతంగా లెక్కిస్తే ఏకంగా కోటీ 18 లక్షల రూపాయల రాబడి పొందే అవకాశం ఉంటుంది. రోజుకు 33 రూపాయలు పొదుపు చేయడం ద్వారా ఈ లాభాలను పొందవచ్చు. తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలని అనుకుంటే మాత్రం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. రీసెర్చ్ చేసి మంచి షేర్లను కొనుగోలు చేస్తే స్టాక్ మార్కెట్ ద్వారా కళ్లు చెదిరే లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

నెలకు 1,000 రూపాయల చొప్పున స్టాక్స్ లో 7 నుంచి పది సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టినా రిస్క్ ఉంటుంది కాబట్టి రిస్క్ కు సిద్ధపడితే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here