Miheeka: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలలో నటిస్తున్నారు నటుడు దగ్గుబాటి రానా.లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఎన్నో విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకొని ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు. ఇలా హీరోగా ఎంతో బిజీగా గడుపుతున్న రానా 2020 కరోనా సమయంలో తాను ప్రేమించిన మిహికా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే వీరి వివాహం జరిగి రెండు సంవత్సరాలు పూర్తి కావడంతో వీరి రెండవ వివాహ వార్షికోత్సవం రోజున ఎవరు ఊహించని విధంగా రానా అందరికీ షాక్ ఇచ్చారు.రానా తన రెండవ పెళ్లి రోజు తన ఇంస్టాగ్రామ్ పోస్టులన్నీ డిలీట్ చేయడంతో పెద్ద ఎత్తున నేటిజన్ లు వీరి గురించి వీరి బంధం గురించి ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు.
పెళ్లిరోజు సందర్భంగా రానా ఇలా పోస్టులు డిలీట్ చేయడంతో ఏదో తేడా కొడుతోంది వీరు కూడా సమంత నాగచైతన్య బాటలో పయనిస్తున్నారా అనే వార్తలు షికార్లు చేశాయి.ఇలా వీరి వైవాహిక జీవితం గురించి ఎన్నో సందేహాలు వ్యక్తం కాగా ఆ వార్తలన్నింటికీ రానా భార్య స్పందిస్తూ చెక్ పెట్టారు. అయితే ఆమె పరోక్షంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

Miheeka: ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన మిహికా…
ఈ క్రమంలోనే తన సోషల్ మీడియా ద్వారా రానాతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా తన రెండవ వివాహ వార్షికోత్సవం రోజున వెంకటేష్ కుమార్తె అలాగే పలువురు సన్నిహితులు వారికి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి కామెంట్స్ కి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశారు. ఈ విధంగా మిహికా పరోక్షంగా తమ గురించి వస్తున్న వార్తలకు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.































