Richa Gangopadhyay: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరికెక్కిన లీడర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి రీచా గంగోపాధ్యాయ్. మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్న ఈమె అనంతరం పలు సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో చాలా తొందరగానే గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈమె కెరియర్ లో మిర్చి సినిమా మంచి హిట్ కొట్టిందని చెప్పాలి.

మిర్చి సినిమా ద్వారా ఎంతో పాపులారీటీ సంపాదించుకున్న ఈమె అనంతరం నాగార్జున సరసన బాయ్ సినిమా ద్వారా సందడి చేశారు.ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈమె తన స్నేహితుడిని వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు.ఇలా పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ పూర్తిగా తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలోనే తనకు ఓ పండంటి బాబు జన్మించిన విషయం తెలిసిందే.

బాబు జన్మించిన తర్వాత రీచా గంగోపాధ్యాయ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం తన బాబు క్యూట్ ఫోటోలను షేర్ చేసిన ఈమె మరోసారి తన ఫ్యామిలీ ఫోటోలను తన కొడుకు ఫోటోలను షేర్ చేశారు.
కాస్త బొద్దుగా తయారైన రీచా గంగోపాధ్యాయ్…
ఇక ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది నెటిజన్లు ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ ఫోటోలలో రిచా గంగోపాధ్యాయ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈమె మునుపటికంటే అధికంగా శరీర బరువు పెరిగిపోవడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ క్రమంలోనే నెటిజన్లు అసలు ఇక్కడ రీచా గంగోపాధ్యాయ్ నా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే తన కుమారుడి మాత్రం ఎంతో ముద్దుగా బొద్దుగా ఉన్నారని చెప్పాలి.
































