Jonnalagadda Padmavathi: అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి కనిపించడంలేదు అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే గుంజేపల్లె గ్రామస్తులు ఇలా పోస్టర్ వేసి అతికించడంతో ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు జొన్నలగడ్డ పద్మావతి సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్నారు.ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చిన ఈమె ఎన్నికలలో గెలిచిన తర్వాత ప్రజాసమస్యలు వినడానికి అందుబాటులో లేరు అయితే ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియడం లేదు తెలిసినవారు ఆచూకి తెలుపగలరు అంటూ గుంజే పల్లి గ్రామస్తులు ఈ పోస్టర్ ను అతికించారు.

ఈ క్రమంలోనే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా తమ అభిమాన ఎమ్మెల్యే గురించి పోస్టర్ వేయడంతో ఎమ్మెల్యే అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఏమాత్రం స్పందించలేదు. మరి తన స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
ఇలా పోస్టర్ లు వేయడం మొదటిసారి కాదు..
అయితే ఈ విధంగా ఎమ్మెల్యే కనపడటం లేదు మంత్రి కనపడటం లేదు అంటూ పోస్టర్లు వేయడం ఇది మొదటిసారి కాదు ఇదివరకే గతంలో ఎన్నో సార్లు మంత్రులు ఎమ్మెల్యేల పై పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా ఇలా పోస్టర్లు వేస్తూ ప్రజలు వారి నిరసనను తెలియజేయడం ఎన్నోసార్లు చోటుచేసుకుంది.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో ఇది ఉద్దేశపూర్వకంగానే చేసిందని కొందరు వైసీపీ అభిమానులు వారి అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. మరి ఈ విషయంపై ఎమ్మెల్యే ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
