MLA Undavalli Sridevi : లవ్ మ్యారేజ్ చేసుకోడానికి కారణం ఇదే… నా కూతురు ఏం చేస్తోందంటే…: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

0
323

MLA Undavalli Sridevi : ఏపీ లో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కి పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ పార్టీ ఆమెను సస్పెండ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సస్పెండ్ అయ్యాక శ్రీదేవి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకుల అవినీతి చిట్టా విప్పారు. ఇక వైసీపీ నేతలు కూడా శ్రీదేవి అవినీతికి పాల్పడిందంటూ ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఇక ఉండవల్లి శ్రీదేవి కూడా వరుసగా మీడియాలో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన వెర్షన్ కూడా చెబుతున్నారు. ఇక అదే సమయంలో ఆమె కుటుంబం గురించి మాట్లాడారు శ్రీదేవి.

మాది ప్రేమ వివాహం…. కూతురు ఏం చేస్తుందంటే…

శ్రీదేవి గారు హైదరాబాద్ లో ప్రముఖ గైనకాలజస్ట్ గా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చి తాడికొండ ఎమ్మెల్యే గా వైసీపీ తరుపున నిలబడి గెలిచారు. ఇక ఆమె భర్త డాక్టర్ శ్రీధర్ కూడా ప్రముఖ యూరాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. పీజీ చేసే సమయంలో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వీరు వాళ్ళ లవ్ స్టోరీ గురించి తెలిపారు. శ్రీధర్ గారు శ్రీదేవి గారికి సీనియర్ అందులోనూ టాపర్ గా ఉంటూ గోల్డ్ మెడలిస్ట్ కావడంతో చాలా ఇన్సిరేషన్ ఇచ్చేవారని అలా పరిచయం తరువాత, తను గైనకాలజస్ట్ ఆయన యూరలాజిస్ట్ అవడం వల్ల ఇద్దరూ కలిసి సర్జరీలను చేయడం అలా ఇద్దరూ ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకుంటానని చెప్పినపుడు పెద్దలు అభ్యంతరం చెప్పలేదని తెలిపారు.

తాను కాపు నేను ఎస్సి మహిళ అనే బేధాలు కుటుంబంలో లేవని, కేవలం రాజకీయాల్లోకి వచ్చాక ఎస్సీ సర్టిఫికెట్ ఎమ్మెల్యే కి పోటీ చేయడం కోసం తీశామంటూ చెప్పారు. ఇక పెద్ద కూతురు మెడిసిన్ చేస్తుండగా చిన్న కూతురు ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోందని, పెద్దమ్మాయి బాగా తెలివైంది చక్కగా మాట్లాడుతుందని తాను మెడిసిన్ తరువాత సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు.