కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల భారతదేశంలోని ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వల్ల కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు ఉద్యోగాలను కోల్పోయారు. కొందరు అప్పులపై ఆధారపడి జీవనం సాగిస్తుంటే మరికొందరు ఒక పూట తిని మరో పూట తినకుండా జీవనం సాగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరేలా చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

దీంతో కొందరు కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయబోతుందంటూ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాన మంత్రి మాన్‌ధన్ యోజన అకౌంట్లు ఉన్నవారికి కేంద్రం నగదు జమ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. కేంద్రం నిజంగా నగదు జమ చేస్తుందేమోనని భావించి కొందరు ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.

ఒక్కొక్కరికి కేంద్రం 3,000 రూపాయలు ఇవ్వబోతుందని.. అకౌంట్లు కలిగిన దేశంలోని ప్రజలందరికీ ప్రయోజనం కలగబోతుందని కేంద్రం చెప్పినట్టు ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే విపరీతంగా ఈ వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వార్త గురించి స్పందించి వివరణ ఇచ్చింది. కేంద్రం నుంచి ఇలాంటి ప్రకటన వెలువడలేదని పీఐబీ స్పష్టం చేసింది.

వైరల్ అవుతున్న వార్తను ప్రజలు నమ్మవద్దని సూచనలు చేసింది. వైరల్ అవుతున్న వార్త నకిలీ వార్త అని.. కేంద్రం ఏదైనా కొత్త స్కీమ్ ను తెస్తే అధికారికంగా ప్రకటన వెలువడుతుందని.. వైరల్ అవుతున్న ఫేక్ వార్తలను నమ్మి మోసపోవద్దని సూచనలు చేసింది. ఇతరులకు వార్తలను షేర్ చేసేముందు ఆ వార్తల్లో నిజానిజాలను నిర్ధారించుకోవాలని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here