Mohammed Shami: టి20 ప్రపంచ కప్ మ్యాచ్లలో భాగంగా ఇంగ్లాండ్ పాకిస్తాన్ పోటీ పడగా పాకిస్థాన్ పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది.టి20 ప్రపంచ కప్ మ్యాచ్లలో భాగంగా రెండోసారి కప్పు గెలవాలని భావించిన పాకిస్తాన్ ఆశలపై ఇంగ్లాండు నీళ్లు చల్లి చివరికి కప్పును సొంతం చేసుకున్నారు.

ఈ విధంగా పాకిస్తాన్ ఓటమి పాలు కావడంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ అక్తర్ బాధాకరమైన ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే షోయబ్ బ్రోకెన్ హార్ట్ ఎమోజి షేర్ చేస్తూ పాక్ ఓటమి పాలు కావడం ఎంతో బాధాకరంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇలా ఈయన ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ పై భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ స్పందించారు.
ఈ సందర్భంగా షోయబ్ చేసిన ట్వీట్ కి ఈయన రిప్లై ఇస్తూ.. దీనినే కర్మ అంటారు బ్రదర్ అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ ప్రపంచ కప్ మ్యాచ్లలో భాగంగా రెండో సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి పాలు కావడంతో టీమిండియా ఆట తీరును ఉద్దేశిస్తూ పాక్ ఆటగాళ్లు హేళన చేస్తూ ట్వీట్లు చేశారు.

Mohammed Shami: పాక్ ఆటగాళ్లకు కౌంటర్ ఇచ్చిన మహమ్మద్ షమీ
ఫైనల్ లో పాకిస్తాన్ భారత్ తో పోటీ పడటం కోసం ఎదురు చూస్తుందని అయితే అది జరగదు అంటూ టీమిండియాని హేళన చేస్తూ కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఫైనల్ లో పాకిస్తాన్ ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలు కావడంతో మహమ్మద్ షమీ ఈ విధంగా షోయబ్ అక్తర్ ట్వీట్ కి కౌటరిస్తూ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Sorry brother
It’s call karma ???????????? https://t.co/DpaIliRYkd
— Mohammad Shami (@MdShami11) November 13, 2022




























