Jonna Vitthula Ramalingeswara Rao: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఎన్నో సినిమాలకు అద్భుతమైన పాటలను అందించి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మోహన్ బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ సినిమా సమయంలో తనపై అనవసరంగా కేసులు వేశారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.దేనికైనా రెడీ సినిమా విడుదల సమయంలో ఎంతో మంది బ్రాహ్మణులు రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆ సినిమా గురించి నినాదాలు చేస్తూ ఆ సినిమాని బ్యాన్ చేయాలని బ్రాహ్మణులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే ఈయన అప్పటి వరకు ఆ సినిమా చూడలేదని ఇలా బ్రాహ్మణులు గొడవ చేయడానికి కారణం ఏంటి అని ఆ సినిమా చూడటానికి వెళ్లానని ఆ సినిమాలో బ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడిన మాటలు పట్ల తనకు కూడా కోపం వచ్చిందని తెలిపారు.ఒక చండీయాగం చేయడానికి బ్రాహ్మణుడు రాకపోతే డబ్బు పడేస్తే తోక ఊపుతూ వస్తారని ఆ సినిమాలో అనడం నిజంగా బాధాకరమని, మరొక బ్రాహ్మణుడి భార్య పరాయి వ్యక్తిని చూసి మీరు అచ్చం మా ఆయన ఉన్నారు అంటూ చెప్పిన డైలాగులు నిజంగానే బ్రాహ్మణుడిని కించపరిచినట్లు ఉందని ఆయన బహిరంగంగా తెలిపారు.
రెండు నెలలకు నాకు నోటీసులు అందాయి…
ఈ విధంగా జొన్నవిత్తుల న్యూస్ డెబిట్ లలో ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇది తప్పు అని చెప్పారు. అయితే ఇలా చెప్పినందుకు ఓ రెండు నెలల తర్వాత తనపై కేసు వేశారనీ ఈ సందర్భంగా దేనికైనా రెడీ సినిమా గురించి తెలిపారు.అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి తాను మోహన్ బాబును కలిసి డైరెక్ట్ గా మాట్లాడలేదని అయినా వారు డబ్బు మదంతో ఇలాంటి సినిమాలు చేసి అది తప్పు అని చెప్పినందుకు నాపై కేసులు వేశారని ఈ సందర్భంగా తెలియజేశారు.






























