Mohan Babu: ఆ హీరోయిన్ తో 10 లక్షల రూపాయల ఫైన్ కట్టించిన మోహన్ బాబు.. అసలేం జరిగిందంటే?

0
1636

Mohan Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో విలక్షణ నటుడిగా, హీరోగా నటించి విశేషమైన ప్రేక్షకాదరణ పొందిన నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న మోహన్ బాబు మరోవైపు విద్యా సంస్థలను కూడా నడుపుతున్న విషయం మనకు తెలిసిందే.

Mohan Babu: ఆ హీరోయిన్ తో 10 లక్షల రూపాయల ఫైన్ కట్టించిన మోహన్ బాబు.. అసలేం జరిగిందంటే?

ఇదిలా ఉండగా మోహన్ బాబు తన బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్ లో తప్పు చేసి పప్పు కూడు అనే సినిమాని నిర్మించారు. ఈ సినిమాకి కోదండరామి రెడ్డి దర్శకుడిగా పని చేశారు. ఇక ఈ సినిమా కోసం మోహన్ బాబు సరసన నటించడానికి నటి ఆర్తి అగర్వాల్ ని సంప్రదించారు.

Mohan Babu: ఆ హీరోయిన్ తో 10 లక్షల రూపాయల ఫైన్ కట్టించిన మోహన్ బాబు.. అసలేం జరిగిందంటే?
Mohan Babu: ఆ హీరోయిన్ తో 10 లక్షల రూపాయల ఫైన్ కట్టించిన మోహన్ బాబు.. అసలేం జరిగిందంటే?

ఆర్తి అగర్వాల్ కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇక ఈ సినిమా మొదలవుతుంది అనే సమయంలో ఆర్తి అగర్వాల్ తనకు పరీక్షలు ఉన్నాయని చెప్పి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక ఈమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాలో హీరోయిన్ గా గ్రేసీ సింగ్ ను ఎంపిక చేశారు.ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్న సమయంలో మోహన్ బాబుకు అసలు విషయం తెలిసింది.

మరో సినిమాకు కమిట్ కావడమే…

ఆర్తి అగర్వాల్ పరీక్షల కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకోలేదని పరీక్ష పేరును అడ్డుపెట్టుకుని మరొక సినిమాలో నటిస్తుందనే విషయం తెలుసుకున్నారు. ఈ విషయం తెలిసి ఎంతో ఆగ్రహం వ్యక్తం చెందిన మోహన్ బాబు తనని ఫిలింఛాంబర్ కు పిలిపించి, ఫిలింఛాంబర్లో ఆమెపై కంప్లైంట్ ఇచ్చి ఏకంగా తనతో 10 లక్షల రూపాయల ఫైన్ కట్టించారట. అప్పట్లో ఈ వార్త పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసింది.