Mokshagna: మోక్షజ్ఞ తన తాత తండ్రి పేరును నిలబెడతారు… బెల్లంకొండ గణేష్ కామెంట్స్ వైరల్!

0
53

Mokshagna: బెల్లంకొండ గణేష్ హీరోగా స్వాతి ముత్యం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది దీంతో ఈయన మరోసారి స్టూడెంట్ సార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కాబోతోంది.

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి గణేష్ నందమూరి వారసుడు మోక్షజ్ఞ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండబోతుందని ఈయన తెలియజేశారు. హీరో కావడం కోసం మోక్షజ్ఞ ఇప్పటికే శిక్షణ కూడా తీసుకుంటున్నారని తెలిపారు.

మోక్షజ్ఞతాను చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని ఇద్దరం కలిసి సినిమాలకు వెళ్లి ఎంజాయ్ చేసే వాళ్ళమని తెలిపారు. అయితే మోక్షజ్ఞ కూడాఇండస్ట్రీలోకి రావాలన్న ఉద్దేశంతో నటనలోనూ డాన్స్ లోను శిక్షణ తీసుకున్నారని తెలియజేశారు. ఇక మోక్షజ్ఞ కూడా తన తండ్రి తాతలాగే కను బొమ్మలతో నటించగలిగే సత్తా ఉందని బెల్లంకొండ గణేష్ తెలియజేశారు.

Mokshagna: ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉన్నట్టు..


మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి నటనలో తప్పకుండా తన తాత ఎన్టీఆర్ గారి పేరును అలాగే తన తండ్రి బాలయ్య పేరును నిలబెడతారని అంత టాలెంట్ మోక్షజ్ఞకు ఉంది అంటూ బెల్లంకొండ గణేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ కావడంతో నందమూరి అభిమానులు సంతోష పడినప్పటికీ ఇంత టాలెంట్ ఉండి ఎన్ని రోజులు ఈయన ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉన్నారు అంటూ మరికొందరు సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు.