ప్రపంచంలోని కార్లన్నీ నాలుగు రంగుల్లోనే.. కారణమేంటంటే..?

0
304

ప్రపంచ దేశాల్లోని ప్రముఖ కార్ల కంపెనీలు వాహనదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కార్లను అందుబాటులోకి తెస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో కొత్త మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచంలో తయారవుతున్న కార్లన్నీ ఎక్కువగా నాలుగు రంగుల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇలా నాలుగు రంగుల్లోనే కార్లు కనిపించడానికి ముఖ్యమైన కారణమే ఉంది.

సిల్వర్, గ్రే, బ్లాక్, వైట్ రంగుల్లోనే మనకు కార్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచంలోని కార్లలో దాదాపు 80 శాతం కార్లు ఈ నాలుగు రంగుల్లో కనిపిస్తాయి. 39 శాతం కార్లు వైట్ కలర్ లో, 9 శాతం కార్లు బ్లూ కలర్ లో మార్కెట్లోకి వస్తున్నాయి. కోటింగ్ ఇండస్ట్రీ నిపుణులు ఇలా నాలుగు రంగులే ఎక్కువగా పాపులర్ కావడానికి గల కారణాలను వెల్లడిస్తూ పాపులర్ రంగులు స్టోర్ చేయడానికి వీలు ఉంటుందని చెబుతున్నారు.

అనేక రంగులతో కార్లను ప్రవేశపెడితే కార్ల రీసేల్ తగ్గుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అందువల్లే కార్ల కంపెనీలు దాదాపు ఒకే రంగులను వినియోగిస్తూ ఉంటాయని వెల్లడిస్తున్నారు. ఈ రంగులను వినియోగిస్తే కస్టమర్ల అభిప్రాయాలను పరిగణనలోకి వేరే రంగును మిక్స్ చేయడం ద్వారా మార్పులు చేయడం కూడా సాధ్యమవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ నాలుగు రంగులు కార్లకు అట్రాక్టివ్ లుక్ తో పాటు లగ్జరీ లుక్ ఇస్తాయి.

కస్టమర్లు సైతం ఎక్కువగా ఈ రంగుల కార్లనే ఎక్కువగా ఇష్టపడతారని నిపుణులు చెబుతున్నారు. పైన పేర్కొన్న నాలుగు రంగులు కాకుండా మిగిలిన నాలుగు రంగులు మార్కెట్ లో అతి తక్కువగా అందుబాటులో ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.