అక్కినేని అఖిల్ నటించిన చిత్రం రొమాంటికి ఎంటర్ టైనర్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రతీ ఒక్కరినీ అలరిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దానికి దర్శకత్వం వహించాడు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం ఇటు చాలా కాలం నుంచి హిట్ దొరొక్క హీరో అఖిల్ కు, దర్శకుడు భాస్కర్ కూడా మంచి విజయాన్ని సాధించి పెట్టింది. తొలి షో నుంచే హిట్ టాక్ తెచుకున్న ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీనిలో పూజా హెగ్డే నటన అద్భుతం అనే చెప్పాలి.
దీనిని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రూపొందించారు. ఈ సందర్భంగా దీనిపై హైదరాబాద్ లో సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ మీట్ లో అతడు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ముందుగా అఖిల్ కు కంగ్రాట్స్ చెప్పాడు.
అతడికి ఇలా పెద్ద హిట్ రావడం ఎంతో ఆనందంగా ఉందంటూ చెప్పాడు. అటు లవ్ స్టోరీ, ఇటు అఖిల్ చిత్రం మంచి హిట్ కావడం.. అక్కినేని ఫ్యామిలీకి ఇది బ్యూటిఫుల్ మూమెంట్ అని అల్లు అర్జున్ అన్నారు. అక్కినేని నాగచైతన్యకు అతడు కంగ్రాట్స్ అని చెప్పాడు. పూజా గురించి మాట్లాడుతూ.. ఆమె ప్రతీ మెట్టు ఎక్కుతూ.. కెరీర్ లో మంచి గ్రోత్ సాధిస్తుందంటూ చెప్పుకొచ్చాడు. ఆమె ఏ హీరోతో తీసినా ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందన్నారు.































