కరోనా సమయంలో.. తల్లి కొడుకులు చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

0
160

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ ఏ విధమైనటువంటి ప్రళయం సృష్టిస్తోందో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువ కావడం వల్ల ఎంతోమంది నిరుద్యోగులుగా మారారు. మరెందరో అనాధలు తినడానికి తిండి లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది తమ గొప్ప మనసుతో ముందుకొచ్చి తమ వంతు సాయంగా కరోనా బాధితులకు వీలైనంత సహాయం చేస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారే ఈ తల్లి కొడుకు.

కరోనా సమయంలో ఎంతో మంది అనాధలకు ఉచిత భోజనం పెడుతూ అందరి ప్రశంసలు పొందుతున్నారు ముంబయికి చెందిన హర్ష్ మాండవియా, అతడి తల్లి హీనా మాండవియా నిరాశ్రయులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ తల్లి కొడుకులు ఇప్పటివరకు 22,000 మీల్స్, 55 వేల రొట్టెలు, 6 వేల స్వీట్లు అందించారు. హర్ష్ చిన్న వయసులోనే తండ్రి పోవడంతో ఎంతో మంది అపరిచితుల సహాయం వల్ల హోటల్ నడుపుతూ ఎంతో స్థాయికి ఎదిగిన వీరు ప్రస్తుత పరిస్థితులలో మరెందరికో సహాయం చేస్తూ ఆదర్శంగా నిలబడ్డారు.

2003లో కస్టమర్ల సహాయంతో ఈ తల్లి,కొడుకులు తమ వ్యాపారాన్ని విస్తరించారు. కొంతమంది వినియోగదారులు 70వేల డిపాజిట్ చేయగా దాంతో వారి వ్యాపారం విస్తరించుకున్నారు. వీరి వ్యాపారం బాగా పుంజుకున్న తర్వాత వారి డబ్బులు వారికి తిరిగి చెల్లించాలని పోతే అందుకు వారు నిరాకరించారు. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి రావడంతో ఈ తల్లి కొడుకులు మానవతా దృక్పథంతో ప్రతిరోజు నిరాశ్రయులకు 100-150 మందికి ఉచిత భోజనాలను అందిస్తున్నారు.

ఈ విధంగా నిరాశ్రయులకు ఉచిత భోజనాన్ని అందించడంతో ఎంతో మంది దాతలు వీరికి విరాళాలను ప్రకటించారు. రెండవ దశ కరోనా ప్రారంభమైనప్పుడు కేవలం రెండు రోజుల్లోనే వీరికి రూ.1.5 లక్షల విరాళాలు అందాయని హర్ష్ తెలిపారు. ఇప్పటి వరకు 22వేల మీల్స్, 55 వేల రొట్టెలు, 6 వేల స్వీట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. వృద్ధులకు భోజనం పెడుతున్నప్పుడు, వారు అందించే దీవెనలు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని తెలిపారు. ఈ విధంగా తల్లి కొడుకుల తమ వంతు సాయంగా చేస్తున్న ఈ పనిపై ఎందరో ప్రశంసలు కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here