వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడేళ్ళ కుమారుడిని కిరాతకంగా హతమార్చింది ఒక తల్లి. తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కన్నప్రేమను మరచిపోయిన ఆ తల్లి తన వివాహేతర సంబంధానికి తన మూడేళ్ల కొడుకు అడ్డుగా ఉన్నాడని విచక్షణారహితంగా కొట్టి హతమార్చింది.

మేడ్చల్ జిల్లా, సూరారం పరిధిలో ఈ ఘటన జరిగింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ మహిళ గత రెండేళ్లుగా తన భర్తకు నుండి దూరంగా ఉంటుంది. అయితే అదే సమయంలో మరో వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తుంది. అయితే ఈరోజు ఉదయం విక్షణ కోల్పోయిన ఆ మహిళ ఆమె కుమారుడు ఉమేశ్ (3) ను తీవ్రంగా కొట్టడంతో ఆ చిన్నారి ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరాడు. అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆ బాలుడు మృతి చెందినాట్టు నిర్ధారించారు వైద్యులు. అయితే వారిద్దరి మధ్యలో కుమారుడు అడ్డున్నాడనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.






























