2020 సంవత్సరం మార్చి నెల నుంచి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే ప్రజల్లో కరోనా మహమ్మారి గురించి భయాందోళన తగ్గినా వైరస్ సోకితే తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త పరిశోధనలు చేస్తూ వైరస్ కు సంబంధించి, వ్యాక్సిన్ కు సంబంధించి కీలక విషయాలను వెల్లడిస్తున్నారు.

తాజాగా శాస్త్రవేత్తలు సీటైల్పిరిడినియం క్లోరైడ్ కలిగిన మౌత్ వాష్ లు కరోనా మహమ్మారిని సులువుగా ఖతం చేయగలవని చెబుతున్నారు. ఈ మౌత్ వాష్ లలో ఉండే విరుసిడెల్ 99 శాతం పాథోజెన్స్ ని అంతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఫలితంగా కరోనా సోకదని తెలుపుతున్నారు. యూనీలీవర్ పరిశోధకులు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే పరిశోధకులు ఈ అంశానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని చెబుతున్నారు.

ఇంగ్లాండ్ లోని కార్డిఫ్ యూనివర్శిటీ శాస్త్ర వేత్తలు ఈ అధ్యయనం ఫలితాలను నమ్మవచ్చని.. అయితే మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని తెలుపుతున్నారు. శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు కరోనాను కట్టడి చేస్తూ ఉండటంతో భవిష్యత్తులో కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలమని భావిస్తున్నారు. మరొవైపు కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి పలు దేశాల్లో వైరస్ విజృంభిస్తోంది.

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కొన్ని నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలంటే 2022 దాకా ఎదురు చూడక తప్పదని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here