MS Dhoni: టి20 ప్రపంచ కప్ సిరీస్ లో భాగంగా టీమిండియా రెండో సెమీఫైనల్స్ కు చేరి ఓటమిపాలైన విషయం తెలిసిందే.ఇలా రెండో సెమీఫైనల్స్ లో ఇండియా ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓటమి పాలు కావడంతో ఎంతోమంది టీమ్ ఇండియా పై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు టీమిండియా ఓడిపోవడంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గుర్తు చేసుకుంటున్నారు.

ఇలా t20 ప్రపంచ కప్ 2022 సెమీఫైనల్స్ లో ఇండియా ఓడిపోవడంతో ఎందుకు ఓడిపోయిందని ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నించుకోగా టీమిండియాలో ఎంఎస్ ధోని లేకపోవడం వల్లే ఓడిపోయిందని వారికి వారే సమాధానం చెప్పుకుంటున్నారు.ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో ఇండియాకు ఎన్నో విజయాలను తీసుకువచ్చారు. ఈయన తర్వాత కెప్టెన్లుగా ఉన్నటువంటి కోహ్లీ రోహిత్ అలాంటి విజయాలను అందించలేకపోయారని అభిమానులు ధోని విజయాలను గుర్తు చేసుకుంటున్నారు.
ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు టీం ఇండియాని విజయపథంలో నడిపిస్తూ ఎన్నో విజయాలను అందించారు.ధోనీ సారథ్యంలో భారత్ 12 ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లు ఆడగా, అందులో 9 విజయాలు సాధించింది. ఇక ధోని నాయకత్వంలో జరిగిన 2007 t20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భాగంగా ఇండియా కప్ సొంతం చేసుకుంది. అనంతరం 2011లో జరిగిన వన్డే ప్రపంచ కప్పును కూడా ఇండియా ముద్దాడింది.టెస్టు, వన్ డే, పొట్టి క్రికెట్ టీ20.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ మంచి విజయాన్ని అందుకుంది.

MS Dhoni: ఏ కెప్టెన్ కు సాధ్యపడని రికార్డులు కొట్టిన ధోని..
ఇక ఈయన రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇలాంటి విజయాలను ఇండియాకి ఏ కెప్టెన్ అందించలేకపోయారు. 2013 వ సంవత్సరంలోనే ధోని శకం ముగిసిందని, ఇన్ని రికార్డులు బద్దలు కొట్టడం మరే కెప్టెన్ కుసాధ్యపడలేదని ప్రతి ఒక్క ఇండియన్ ధోని ఆట తీరును ఆయన ఇండియాకు అందించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.






























