Big Boss Non stop: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో వినోదాన్ని అందించే బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నాన్ స్టాప్ గా ప్రసారం అవుతూ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తుంది. ఇక ఈ కార్యక్రమం ప్రారంభం అయి వారం రోజులు పూర్తయ్యే సరికి ఇంట్లో నామినేషన్స్ గొడవలు ప్రారంభమయ్యాయి ఈ క్రమంలోని ఒకరిపై మరొకరు దూషించుకోడం, పోట్లాడుకోవడం కొట్టుకోవడం వరకు వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇంటి సభ్యులకు సరికొత్త టాస్క్ నిర్వహించారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే ఎవరి మోహం చూడాలనుకుంటున్నారు ఎవరి మొహం చూడకూడదు అనుకుంటున్నారు చెప్పాలి అని అడిగారు ఈ క్రమంలోనే యాంకర్ చైతు తను ఉదయం నిద్రలేవగానే బిందుమాధవి మొహం చూస్తే తనకు ఆ రోజంతా ఎంతో హ్యాపీగా ఉంటుందని తెలిపారు.

అదేవిధంగా తనకు ఉదయం లేవగానే బిగ్ బాస్ తో గొడవపడే ముమైత్ ఖాన్ మొహం చూడకూడదు అనుకుంటున్నాను అంటూ తెలిపారు. ఇలా ఈ టాస్క్ లో భాగంగా యాంకర్ చైతు ముమైత్ ఖాన్ ను అవమానించడంతో ఆమె బోరున ఏడ్చేసింది.నాకు తెలుగు సరిగ్గా రాదు కాబట్టి సరిపోయింది. ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తూ నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు … గుద్దుతా అంటూ చైతు పై ముమైత్ ఖాన్ ఫైర్ అయ్యారు.
నవ్వించే ప్రయత్నం చేసిన అషూ రెడ్డి….
ఈ విధంగా తనపై ముమైత్ ఖాన్ ఫైర్ అవ్వడంతో యాంకర్ చైతు ఉదయం లేవగానే సిగరెట్ల కోసం ఏడుస్తుంది అలా ఏడవ కూడదని చెప్పాను అందులో నా తప్పు ఏమాత్రం లేదు అంటూ చైతూ తనని తాను సమర్థించుకున్నాడు. ఇక ఈ టాస్క్ లో భాగంగా ముమైత్ ఖాన్ ఏడవడంతో తనని నవ్వించే ప్రయత్నం చేసింది అషూ రెడ్డి. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా తేజస్వి కెప్టెన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది ఈమె నటరాజ్ మాస్టర్ ను స్టోర్ కీపర్ గా ఎంచుకున్నారు.































