ఎన్టీఆర్ తో కలిసి ఒక్క షాట్ అయినా చేయాలి.. : నటి వనిత విజయ్ కుమార్

0
549

నటి వనిత విజయ్ కుమార్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ సెలబ్రెటీలు అయినటువంటి మంజుల విజయ్ కుమార్ పెద్ద కుమార్తె వనిత విజయ్ కుమార్ “దేవి” సినిమా ద్వారా తెలుగు తెరపై సందడి చేశారు. ఈ సినిమా తర్వాత ఈమె తెలుగులో కనిపించలేదు.అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈ నటి గురించి సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి.

ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి వనిత విజయ్ కుమార్ తాజాగా బుల్లితెరపై ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా వనిత పలు ఆసక్తికరమైన విషయాలను ముచ్చటించారు. ఈ క్రమంలోనే అలీ ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెబుతూ విజయ్ కుమార్ తో సరదాగా ముచ్చటించారు.

ఈ సందర్భంగా అలీ ఆమెను పలు ప్రశ్నలు అడుగుతూ తెలుగులో దేవి సినిమా తర్వాత అవకాశాలు రాలేదా? వచ్చినా కూడా నటించ లేదా అని అడగగా.. అందుకు ఆమె సమాధానం చెబుతూ అవకాశాలు వచ్చాయి అయితే లవ్ కారణంగా సినిమాలను చేయలేదని సమాధానం చెప్పారు. అదే విధంగా తమిళ పవర్ స్టార్ ను నిజంగానే పెళ్లి చేసుకున్నారా అని అడగగా… అందుకు వనిత నాలుగు కాదు 40 పెళ్లిళ్లు చేసుకుంటా నీకేమైనా అభ్యంతరమా అనే డైలాగు ను మరోసారి ఈ కార్యక్రమంలో వినిపించింది. అయితే ఇది సరదాగా అనింది.

ఈ క్రమంలోనే అలీ తన తండ్రి, చెల్లెళ్లతో కాంటాక్ట్ లో ఉన్నారా అని అడగగా అందుకు వనిత కాస్త ఎమోషనల్ అవుతూ సమాధానం చెప్పారు.ఈక్రమంలోనే తెలుగులో అవకాశం వస్తే నటిస్తారా అని అని అనడంతో నాకు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి జీవితంలో ఒక్క షాట్ లోనే నటించాలనే కోరిక ఉందని ఈ సందర్భంగా వనిత విజయ్ ఈ కార్యక్రమం ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయడంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.