Koena Mitra: చిత్ర పరిశ్రమలో హీరోయిన్ కోయినా మిత్రా బంధుప్రీతి, గ్రూపిజం ఎదుర్కొన్నానని.. ఇలాంటి వాటి వళ్ల తన కెరీర్ సందిగ్ధంలో పడిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడింది. ఆమె తన బాడీకి ప్లాస్టిక్ సర్జరీ చేయించున్న విషయాన్ని మీడియా ముందు కొన్ని రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇలా ప్లాస్టిక్ సర్జరీ గురించి చర్చించినందుకు ఎదురుదెబ్బలు తగిలాయని చెప్పుకొచ్చింది. నాకు బయట నుంచి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. పెద్ద బ్రేక్ వచ్చిందని చెప్పుకొచ్చింది. అంతే కాదు.. నాకు చాలా అవసరమైనప్పుడు.. పరిశ్రమ నుండి ఎవరూ నాకు అండగా నిలబడలేదని చెప్పారు.

కొంతమంది ఎదురుగా ఒక మాట.. నా వెనుకాల మరో మాట మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చింది. ఇలా హితబోధ చేసేవారు మీడియా ముందుకు వచ్చినప్పుడు మాత్రం నోరు మెదపరని చెప్పింది. ఇంటర్వ్యూలో తన సర్జరీ గురించి మాట్లాడుతూ.. మూడేళ్లపాటు నెటిజన్ల కామెంట్లు తనను చిత్రహింసలకు గురిచేశాయని కోయెనా పేర్కొంది.
నెగిటివ్ వార్తలు ప్రసారం చేసింది..
పరిశ్రమలోని వ్యక్తులు కూడా అదే విధంగా ఒక అడుగు వెనక్కి వేస్తున్నారని.. తనతో మాట్లాడేందుకు భయపడుతున్నారని చెప్పుకొచ్చింది. అయితే తాను శస్త్రచికిత్స గురించి మాట్లాడకూడదు అన్న విషయం తనకు తెలియదు అని.. ఎవరో నన్ను అడిగారు.. దానికి సమాధానంగా నిజం చెప్పానని.. ఆరోజు నుంచి వివిధ రకాల కామెంట్లతో విసిగిస్తున్నారని.. మూడు సంవత్సరాల పాటు నా శస్త్ర చికిత్స గురించి నిరంతరం మీడియా నా గురించి నెగిటివ్ వార్తలు ప్రసారం చేసింది. ఆ సమయంలో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది కూడా నాకు దూరమయ్యారు. అది నా పనిపై కూడా ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి తాను చింతించడం లేదని.. ఏదైనా అది నా నిర్ణయం.. ఇది నా ముఖం.. నా జీవితం.. దీనితో ప్రజలకు ఎందుకు సమస్య.. అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు..

































