మా ఫ్యామిలీలో ఆ నలుగురికి మెంటల్..! నిహారిక షాకింగ్ కామెంట్స్!

0
1328

టాలీవుడ్ నటి, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల గురించి అందరికీ పరిచయమే. మెగా ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించింది. కానీ ఎక్కువ కాలం కొనసాగలేక పోయింది. అంతేకాకుండా అవకాశాలు కూడా అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

గత ఏడాది జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వెబ్ సిరీస్ లలో బాగా బిజీ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షో లో పాల్గొన్నది. ఇక ఈ షో లో ఆలీ వ్యాఖ్యాతగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిహారిక తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంది.

తాను చిన్నప్పుడు టీచర్ కావాలని అనుకుందట. ఆ తర్వాత డాక్టర్ కావాలని అనుకోగా బైపీసీ చదవాలని కానీ అందులో ఫిజిక్స్ ఉంటుందని భయపడి డాక్టర్ చదువు చదువలేకపోయిందట. ఇక తన తండ్రి నాగబాబు తనను ముద్దుగా మమ్మీ అని పిలుస్తారని తెలిపింది. తన సోదరుడు వరుణ్ బాగా ముద్దొస్తే పంది అని పిలుస్తాడట.

చిన్నప్పుడు తన అన్నతో బాగా ఫైట్ చేసేదట. కోపంతో అతని మొహం పై మొత్తం గీతలు కూడా గీసేసానని తెలిపింది. ఓసారి కారులో బాగా అల్లరి చేస్తున్నప్పుడు తన తండ్రి గట్టిగా కొట్టాడని ఆ తర్వాత తన తండ్రి బాధపడ్డాడని తెలిపింది. తనకు పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు ముగ్గురిలో తన తండ్రి అంటేనే ఇష్టమని తెలిపింది. తనది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తన భర్త గురించి కొన్ని విషయాలు తెలిపింది. ఈ క్రమంలో మాట్లాడుతూ ‘మా ఫ్యామిలో నాకు, సాయి ధరమ్ తేజ్, మా చిన్నత్త, మా నాన్నకు మా నలుగురికి కొంచెం మెంటల్ అంటూ ఫాన్నీ కామెంట్స్ చేసారు నిహారిక. ఇక ప్రస్తుతం తను నిర్మాతగా బాధ్యతలు చేపట్టి ఓ సినిమాను నిర్మిస్తుంది. త్వరలోనే ఆ మూవీ విడుదల కానుంది.