మీరు ఇంకా వాక్సిన్ తీసుకోలేదా ?అయితే ఇది తెలుసుకోండి ?

0
292

కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరగడంతో వాటిని కట్టడి చేయడం కోసం దేశవ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతోంది.ఈ క్రమంలోనే వ్యాక్సిన్ వేయించుకోవడానికి మొదట్లో ప్రజలు ముందుకు రాకపోవడంతో వ్యాక్సిన్ పై అధికారులు ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.కానీ కొందరికి మాత్రం వ్యాక్సిన్ ఎక్కడ వేస్తారు? ఏంటి? అనే విషయాలు తెలియక ఎంతో సందిగ్ధంలో ఉన్నారు.

ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన వాట్సాప్ బాట్ తీసుకువచ్చింది. దీనిని ఉపయోగించి మనకు దగ్గరలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి +919013151515 నెంబరును సేవ్ చేసుకున్న తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి ఈ నెంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ పెట్టాలి. హాయ్ అని మెసేజ్ పంపగానే వెంటనే MyGov Corona Helpdesk కు సంబంధించిన బాట్‌ యాక్టివ్‌ అవుతుంది. 

వాట్సాప్ బాట్ యాక్టివ్ అవగానే మనకు ఒక మెసేజ్ వస్తుంది. అందులో నుంచి ఒక నెంబర్ ను తిరిగి వాట్సాప్ ద్వారా రిప్లై పంపాలి. మీ ఇంటికి దగ్గరలో ఉన్న కోవిడ్ వ్యాక్సినేషన్‌ సెంటర్ల వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా మనము 1 నొక్కాలి. ఆ తరువాత మరొక రెండు ఆప్షన్లతో మెసేజ్ మనకు వస్తుంది. వీటిలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ల ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనికి బదులుగా మరొక సారి 1 నొక్క గానే పిన్ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది.

6 సంఖ్యల పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మనకు మన దగ్గరలో ఉన్నటువంటి కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ల వివరాలు అక్కడ ఉన్న వ్యాక్సినేషన్ స్లాట్స్‌ అవైలబిటీ అలాంటి పూర్తి వివరాలను మీ వాట్సప్ కు మెస్సెజ్ రూపంలో మనకు వస్తాయి. వాక్సినేషన్ సెంటర్ లతోపాటు వ్యాక్సిన్ కోసం మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన లింక్ కూడా వస్తుంది.ఈ లింక్ ద్వారా మనం వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here