అతడి తొలి సినిమా ఎన్ కౌంటర్ తో సంచలనానికి తెరలేపాడు.. అంతేకాదు.. ఆ తొలిసినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అతనెవరో ఇప్పటికే అర్థం అయిఉంటుది. ప్రముఖ దర్శకుడు.. సామాజిక స్ఫూర్తి కలిగించే సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట అయిన ఎన్. శంకర్. 1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం లాంటి స్ఫూర్తి కలిగించే సినిమాలు ఎన్నో తీశారు.

అనేక అవార్డులు, రివార్డులతో పాటు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా ఎన్నో ప్రశంసలు అందుకుంది. తాజాగా అతడు ఓ ఇంటర్వ్వూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

మొదట తాను సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న సమయంలో ఎన్నో కష్టాలు అనుభవించానని.. ఓ రోజు కోపంతో ప్రముఖ నిర్మాత కొడకును కొట్టానని.. దానికి కృష్ణంరాజు తనని మందిలించాడన్నారు. నిర్మాత కొడకును కొట్టడం ఏంటి అని కృష్ణంరాజు అడగ్గా.. నిర్మాత కొడుకు అయితే మిగతావారిని తిట్టొచ్చా అని తిరిగి సమాధానం చెప్పాడట.
అతడికి స్వారీ చెప్పు అని అంటే.. తిట్టినందుకు ముందు అతడిని స్వారీ చెప్పమనండి.. తర్వాత నేను చెబుతా అని అనగానే.. కృష్ణంరాజు నిర్మాత కొడుకును పిలిచి అడిగాడు. తిట్టావా అతడిని అని అడగ్గా.. అవును తిట్టాను అని కృష్ణంరాజుకు చెప్పాడు. కృష్ణంరాజు ముందు నిర్మాత కొడుకుతో స్వారీ చెప్పించి.. తర్వాత నాతో స్వారీ చెప్పించాడని అన్నారు. తర్వాత అతడు.. నేను షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నామని చెప్పాడు.
































