Naatu Naatu Song: నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఇండియన్ మాజీ క్రికెటర్స్… వీడియో వైరల్!

0
47

Naatu Naatu Song: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల అయ్యి ఏడాది అవుతున్నా కూడా ఈ సినిమాలోని ఈ పాటకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.

ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ ప్రేక్షకుల వరకు ఈ పాటకు అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు. ఇలా నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ పొంది ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది.

ఇలా ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నటువంటి నాటు నాటు పాటకు తాజాగా మాజీ క్రికెటర్స్ హర్భజన్ సింగ్, సురేష్ రైనా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Naatu Naatu Song: మైదానంలోని డాన్స్ చేసిన క్రికెటర్స్…

ఇండియాకు వరల్డ్‌ కప్‌ అందించిన జట్టు సభ్యులు అయినటువంటి వీరిద్దరూ తాజాగా లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో కలిసి ఆడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే క్రికెట్ మైదానంలో వీరిద్దరూ కలిసి ఎన్టీఆర్ రామ్ చరణ్ తరహాలోనే నాటు నాటు పాటకు స్టెప్పులు వేసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.