Actor Naga Anvesh: ఇంట్లో ఇల్లాలు వట్టింట్లో ప్రియురాలు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు నాగ అన్వేష్. ప్రస్తుతం ఏంజిల్ , వినవయ్యా రామయ్యా చిత్రాలతో హీరోగా మారి, మరోసారి అభిమానులను అలరించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అనుకున్నంత స్థాయిలో ఈ సినిమాలు ఆశించిన ఫలితాలను అందించలేకపోయినా మంచి గుర్తింపుని మాత్రం తీసుకొచ్చిపెట్టాయని చెప్పవచ్చు.

నాగ అన్వేష్ నటించిన ఏంజిల్ చిత్రం కోసం భారీ బడ్జెట్, కంప్యూటర్స్ గ్రాఫిక్స్ కోసం ఎక్కువగానే ప్రచారం జరిగింది. స్వర్గం నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అంతగా సక్సెస్‌ను సొంతం చేసుకోకపోయినా నటుడిగా నాగ అన్వేష్ తన పాత్రకు న్యాయం చేశారని విశ్లేషకులు భావించారు.

కాగా కొంత కాలం నుంచీ సినిమాలకు దూరంగా ఉన్న నాగ అన్వేష్ ఒక శుభవార్తను తెలియజేశారు. త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నట్టు ప్రచారం కాగా, ఇటీవలే ఆయన నిశితార్థం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అమ్మాయి గురించి చెప్పాలంటే ఆమె నాగ అన్వేష్ స్నేహితురాలైన కావ్య. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఈ మధ్యే ఇరువురి ఇంట్లో వారిని ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం.
వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు…
ఇక కావ్య తండ్రి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ కంపెనీ డైరెక్టర్ విజయ్ కుమార్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ కావడం వీరి ఎంగేజ్‌మెంట్ జరిగిన వార్త బయటకు వచ్చింది. దీంతో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సినీ వర్గాల సమాచారం. మరి పెళ్లి తరువాత అన్వేష్ సినిమాల్లో నటిస్తాడా? లేదా అనే విషయమాలు మాత్రం తెలియ రాలేదు.
































