నాగచైతన్య విడాకుల ప్రకటన తర్వాత వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాగార్జున, నాగచైతన్య జంటగా నటిస్తున్నటువంటి చిత్రం బంగార్రాజు. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ గా వస్తున్నటువంటి చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.

ఇక ఇందులో నాగార్జున సరసన శివగామి రమ్యకృష్ణ నటించగా.. నాగ చైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తున్నారు. ఇకపోతే నవంబర్ 23 వ తేదీ నాగచైతన్య పుట్టిన రోజు కావడంతో తను నటిస్తున్న బంగార్రాజు చిత్రం నుంచి వరుస సర్ప్రైస్ లను ఇవ్వనున్నారు.
ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం బంగార్రాజు చిత్రం నుంచి చిత్రబృందం నాగచైతన్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అయితే ఈసారి బంగార్రాజు చిత్రంలో నాగచైతన్య బంగార్రాజు పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే నాగచైతన్య పుట్టిన రోజు కావడంతో మంగళవారం ఉదయం 10:23 గంటలకు బంగార్రాజు చిత్రం నుంచి మరొక సర్ ప్రైజ్ రానుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ఒక పోస్టర్ ను విడుదల చేసారు. ఈ క్రమంలోనే ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ లుక్ అక్కినేని నెటిజన్లను ఆకట్టుకుంది.































