Nagachaitanya -Sobhita: నాగచైతన్య శోభిత వివాహానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది నేడు సాయంత్రం 8 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం ఎంతో ఘనంగా జరగబోతుంది. ఈ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈ పెళ్లి వేడుకకు ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు.

ఇలా ఇప్పటికే కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు అన్నపూర్ణ స్టూడియోలో ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు. ఇక సాయంత్రం ఎనిమిది గంటలకు జరగబోయే ఈ పెళ్లి వేడుకలలో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా సందడి చేయనున్నారు. ఇక నా సమంత విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకుంటున్నారు.
ఇకపోతే వీరి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఈ పెళ్లి వేడుక హిందూ సాంప్రదాయ ఆచారాల ప్రకారం జరగబోతుందని తెలుస్తుంది. ఇక పెళ్లికి వచ్చిన అతిథుల కోసం నాగార్జున ఎన్నో రకాల వెరైటీలను వడ్డించబోతున్నారని తెలుస్తుంది.

Nagachaitanya -Sobhita: తెలుగు వంటకాలు..
మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ అయినటువంటి ఫుడ్ మొత్తం ఇక్కడ ఉందని తెలుస్తుంది. తాజాగా చైతన్య శోభిత పెళ్లిలో పెట్టబోయే ఫుడ్ కి సంబంధించిన మెనూ కూడా వైరల్ అవుతుంది. కాకినాడ కాజా, తాపేశ్వరం కాజా, యాపిల్ హల్వా, జిలేబీ, డజను బిర్యానీ వెరైటీలు, బంగాళదుంప కుర్మా, మామిడికాయ ప్పు, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, గుత్తి వంకాయ, మజ్జిగ పులుసు , స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కుల్ఫీ, ఫాలూదా, టిక్కీ, టమాటా ఛాట్, పాలక్ ఛాట్, చనా కచోరీ, దహీ పూరి లాంటి ప్రత్యేక వంటకాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.



























