సమంత, నాగచైతన్య పెళ్లి రోజుకు సరిగ్గా నాలుగు రోజుల ముందు విడాకుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఎందుకు విడిపోయారో మాత్రం కారణం చెప్పలేదు. తర్వాత సోషల్ మీడియాలో వీళ్ల గురించి ఇష్టం వచ్చినట్లు వార్తలు రాసిన విషయం తెలిసిందే.

నాగచైతన్య ఫ్యామిలి కారణంగానే సమంత విడిపోయిందని.. సమంత కారణంగానే ఆ ఫ్యామిలీ దూరం అయిందని రాసుకొచ్చారు. ఇలా చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే సమంత విడాకుల తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని వార్తలకు స్పందించారు. ఆ విషయంలో పురుషులను కూడా ప్రశ్నించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టు కూడా చేశారు.
మరికొన్ని పోస్టులను సమంత అభిమానులతో పంచుకుంది. కానీ నాగచైతన్య ఆ రోజు నుంచి సోషల్ మీడియాలో ఒక్క పోస్టు కూడా చేయలేదు. తాజాగా మొదటి సారిగా అతడు స్పందించాడు. అందేంటంటే.. రాజ్ తరుణ్ నటిస్తున్న ‘అనుభవించు రాజా’ పోస్ట్ పెట్టాడు. టైటిల్ ట్రాక్ విడుదల కావడంతో చిత్ర యూనిట్ కు గుడ్ లక్ చెప్పాడు.

దీంతో ఈ పోస్టును కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దాని కింద కొంతమంది విడాకుల ప్రస్తావన తీసుకువస్తూ.. సార్ మీరు విడిపోవడానికి గల కారణం ఏంటి అంటూ నెటిజన్లు అడగుతున్నారు. కానీ వాటికి చైతు రిప్లై ఇవ్వలేదు. ఇప్పటికే నాగార్జున, రామ్ చరణ్ అనుభవించు రాజా సినిమా ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ చేయగా నాగ చైతన్య ఈ సినిమాలో మొదటి పాటను విడుదల చేశారు.
































