Nagashaurya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి వారిలో నాగశౌర్య ఒకరు ప్లాపులతో సంబంధం లేకుండా అవకాశాలు వచ్చిన వాటన్నింటిని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా ఏడాది బెంగళూరుకు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

వీరి వివాహం జరిగి దాదాపు ఏడాది కూడా పూర్తి అయింది.అయితే తాజాగా అనూష నాగశౌర్య గురించి నాగశౌర్య తల్లి ఉష ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టడంతో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో నాగశౌర్య తన భార్య అనూష గురించి ఈమె షాకింగ్ విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా నాగశౌర్య తల్లి మాట్లాడుతూ అనూష నాకు ముందు నుంచి తెలుసు తాను చాలా మంచి అమ్మాయి. ఏ విషయానైనా ఉన్నతంగా ఆలోచిస్తుంది తన పనులు అన్ని కూడా చాలా చక్కబెడుతుంది శౌర్యకు నా ప్లేస్ ను తాను రీప్లేస్ చేసిందని చెప్పాలి అంత మంచి అమ్మాయి. ఇక నన్ను మమ్మ అని పిలుస్తుంది మా ఆయనని డాడీ అంటూ పిలుస్తుందని తెలిపారు.
మమ్మల్ని మమ్మీ డాడీ అని పిలుస్తుంది..
అనుష నాగశౌర్యకు పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ ఈ సందర్భంగా తన కోడలు గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అయితే వీరిద్దరూ పెళ్లి అయిన తర్వాత తమ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండి మరొక ఇంట్లో ఉంటున్నారని వెల్లడించారు. అయితే ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని మేము వారి పెళ్లికముందే పెళ్లయిన తర్వాత వేరుగా ఉండాలని డిసైడ్ చేసామని తెలిపారు. ప్రస్తుత కాలంలో పిల్లల ప్రతి ఒక్కరు కూడా వారికి నచ్చిన విధంగా ఉండాలని కోరుకుంటారు. అందరూ కలిసి ఉండే వారి కోరికలకు మనం అడ్డుకట్ట వేస్తే గొడవలు జరుగుతాయి అందుకే వారికి కావలసిన స్వేచ్ఛ వారికిచ్చి అందరూ ఎప్పుడైనా ఒకసారి కలిసినప్పుడు బంధాలు బలపడతాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము అంటూ ఉష ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.



























