సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. మంత్రి పేర్ని నాని గురించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ మాటలు రాజకీయంగా పెను సంచలనమే స్పష్టించాయి. ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏపీ మంత్రులు.. అదే విధంగా పవన్ వర్సస్ పోసాని అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా సినీ నటుడు పోసాని తెర మీదకు తొలి రోజు పవన్ పైన విమర్శలు చేసారు.

జగన్ పాలనను ప్రశంసించారు. ఇక రెండ సారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు వ్యక్తిగత దూషణలకు దారితీశాయి. అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఇక వెంటనే నాగబాబు.. అతడికి వార్నింగ్ ఇచ్చాడు. ఆస్క్ మీ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమాను ల ముందుకు వచ్చారు. అనేక ప్రశ్నలకు మీమ్స్ తోనే సెటైరికల్ గా సమాధానాలు ఇచ్చారు. మళ్లీ పాలిటిక్స్‌లో వస్తారా అంకుల్ అనే ప్రశ్నకు.. నాకు ఇంట్రెస్ట్ పోయింది అనే మీమ్‌తో ఆన్సర్ ఇచ్చారు. అందులో భాగంగా.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ గురించి స్పందించాలని కోరగా ఆయన ఒక పవన్ పైన పోసాని మాట్లాడిన ఒక వీడియో పోస్టు చేసారు.
ఆ వీడియోలో ఏముందంటే.. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో పవన్ సినిమాలోకి వస్తానంటే.. తాను అతడికి బ్లాంక్ చెక్ ఇస్తానని.. అందులో ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చన్నాడు. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఇండియాలోని టాప్ హీరోల్లో అతనొకరు…అని అందులో పోసాని చెబుతారు. ఇక ఏపీలో ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారంలో ఏపీ మూవీ టికెట్స్ గురించి మీ అభిప్రాయం అడగ్గా విక్రమార్కుడు చిత్రంలో రవితేజ, బ్రహ్మానందం మోసాలు చేసి డబ్బులు పంచుకునే సన్నివేశాన్ని పోస్ట్ చేశారు.
అందులో వారిద్దరు డబ్బులు పంచుకుంటుండగా.. ఎప్పుడైనా సరిగ్గా పంచావరా.. అటూ బ్రహ్మానందం వాపోయే సీన్ చూపించారు. మోసం చేసినవాడు బాగుపడడురా.. అని బ్రహ్మానందం శపించగా… ఆ మనం చేసేది గుళ్లో పూజ మరి అని రవితేజ లైట్ తీసుకుంటాడు. ఇక, పోసాని గురించి ఒక్క మాట అనే దానికి మాధానంగా..సమరసింహారెడ్డి లో బాలకృష్ణ ఫొటో పోస్ట్ చేశారు. ఆ సన్నివేశంలో డైలాగ్… కుక్కపిల్ల మొరిగిందనుకో అనేది ఆ ఫొటో సారాంశంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి కొన్ని ప్రశ్నలకు నాగబాబు మీమ్స్, ఆడియో, వీడియోలతో సమాధానం చెబుతారు.



























