Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య త్వరలోనే శోభిత మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు. శోభిత చైతన్య వివాహం డిసెంబర్ 4వ తేది అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుంది ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య శోభితతో తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ శోభితతో నా పెళ్లిని మాకెంతో సెంటిమెంట్ అయినటువంటి అన్నపూర్ణ స్టూడియోలో మా తాతయ్య విగ్రహం ముందు జరపడానికి మా కుటుంబ సభ్యులందరూ కూడా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ వేడుకను చేయడం కోసం ఇరువురు కుటుంబ సభ్యులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాగచైతన్య తెలిపారు.
ఇక శోభితతో నాకు డీప్ కనెక్షన్ ఏర్పడిందని ఆమెతో జీవితాన్ని పంచుకోవడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. శోభితతో కలిసి నా కొత్త ప్రయాణాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నానని చైతన్య తెలిపారు..నేను ఆమెతో డీప్ గా కనెక్ట్ అయ్యాను. ఆమె నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటుంది. నాలో ఖాళీని పూర్తి చేస్తుంది. మున్ముందు మాది అద్భుతమైన ప్రయాణం కానుంది అని చైతూ అన్నారు. నా పెళ్లి స్పెషల్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ నాగచైతన్య తెలిపారు.

Nagachaitanya సమంత అర్థం చేసుకోలేదా..
ఇలా శోభితతో తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన నాగచైతన్య పరోక్షంగా సమంతతో తనకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదని ఆమె తనని అర్థం చేసుకోలేకపోయిందని చెప్పకనే చెప్పేశారు. ఇలా నాగచైతన్య శోభిత పెళ్లి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సమంత అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.


























