Nagachaitanya: అక్కినేని నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల నాగచైతన్య సమంతకు దూరం కావాల్సి వచ్చింది. ఇలా సమంతకు దూరమైనటువంటి నాగచైతన్య ఒంటరిగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే నాగచైతన్య గురించి గత కొద్దిరోజులుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాగచైతన్య నటించిన ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై నాగచైతన్యను ప్రశ్నించగా ఆయన ఒక చిన్న నవ్వు నవ్వి వదిలేసారు. కానీ వీరిద్దరూ విదేశాలలో జంటగా తిరుగుతున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు బలమయ్యాయి.
ఇక నాగచైతన్య తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా మే 12వ తేదీ తెలుగు తమిళ భాషలలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగచైతన్యకు తన క్రష్ ఎవరో చెప్పమంటూ ప్రశ్నలు వేశారు.

Nagachaitanya: శోభిత మీ క్రష్ అని మాకు తెలుసు..
ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ… నా క్రష్ విషయంలో ఎటువంటి సీక్రెట్ లేదు. హాలీవుడ్ యాక్ట్రెస్ మార్గట్ రోబీ పై నాకు చాలా క్రష్ ఉంది. రీసెంట్ గా ఆమె నటించిన బేబీలాన్ సినిమా చూశాను. ఆ మూవీలో తన నటనకు ఫిదా అయ్యాను ప్రస్తుతానికి తనే నా క్రష్ అంటూ సమాధానం చెప్పారు అయితే ఈ వీడియో పై ఎంతో మందిని స్పందిస్తూ మీ శోభిత అని మాకు తెలుసు పైకి ఏదో అలా చెబుతున్నారు అంటూ కామెంట్లో చేస్తున్నారు.



























