Nagarjuna : టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నపుడే కాదు ఆరు పదుల వయసులో కూడా అమ్మాయిలకు అభిమాన హీరోగా ఉన్నాడు. రొమాంటిక్ హీరోగా ఎన్నో హిట్లు అందుకున్న నాగార్జున అంటే చాలా మంది అమ్మాయిలకు ఇష్టం. ఇక అప్పట్లో గ్రీకు వీరుడు అంటూ పాటలు పాడేసుకునేవారు. ఇక నాగార్జున అంటే సాధారణ అమ్మాయిలే కాదు సెలబ్రిటీలు కూడా పడిపోయేవారు. చాలా మంది హీరోయిన్లకు నాగార్జున మీద క్రష్ ఉండేదంటూ వార్తలు ఉన్నాయి. ఇక ప్రతి హీరోకి ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది ఈ హీరోయిన్ తో రిలేషన్ ఉంది అంటూ వార్తలు మామూలే కానీ నాగార్జున ఒక బాలీవుడ్ హీరోయిన్ తో సీక్రెట్ గా ఎఫైర్ నడిపాడంటూ వార్తలు వినిపించాయి.

బాలీవుడ్ బ్యూటీ నాగ్ ప్రేమలో పడిందంటూ…
హీరో నాగార్జున దగ్గుబాటి వారి ఆడబిడ్డ లక్ష్మి ని పెళ్లిచేసుకుని ఆ తరువాత విడాకులు తీసుకున్నారు. ఇక హీరోయిన్ అమలను పెళ్లి చేసుకున్నాడు నాగార్జున. అయితే నాగార్జున కు నిన్నేపెళ్లాడుతా సినిమా తరువాత టబు తో ఎఫైర్ ఉంది అని వార్తలు వినిపించాయి. ఇప్పటికీ టబు పెళ్లి చేసుకోకుండా ఉండిపోడానికి నాగార్జున కారనం అంటూ గాసిప్స్ వినిపిస్తుంటాయి. అయితే నాగార్జున ప్రేమలో కేవలం టబు నే కాదు మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ కూడా పడిందనే రూమర్ అప్పట్లో బాగా వినిపించేది.

ఆమె ఎవరో కాదు మాజీ విశ్వ సుందరి సుస్మిత సేన్. నాగార్జునతో కలిసి రక్షకుడు సినిమాలో నటించింది. ఇక వీళ్లిద్దరికీ అప్పట్లో అఫైర్ ఉండేదని, తరచూ ఆమె కోసం ముంబై సీక్రెట్ గా నాగార్జున వెళ్ళేవాడంటూ కథనం. మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ మన్మధుడి ఖాతాలో ఉన్న హీరోయిన్ల జాబితాలో సుస్మితతో పాటు హీరోయిన్ శ్రీయా, అనుష్క శెట్టి పేర్లు కూడా బలంగా అప్పట్లో వినిపించేవి. ఇప్పటికీ కుర్రహీరోయిన్లు నాగ్ అంటే క్రష్ అంటూ చెప్పేవారున్నారు.































