
ఇలా నాగచైతన్య సమంత వారి వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ ఇటు నాగచైతన్య కుటుంబం ఈ విషయంపై ఏ మాత్రం స్పందించలేదు.అయితే తాజాగా సమంత తండ్రి వీరి విడాకుల విషయంపై స్పందిస్తూ ఎంతో విచారం వ్యక్తం చేయగా నాగార్జున సైతం నాగచైతన్య సమంత విడాకులపై మొదటిసారి స్పందించారు.
ఈ విధంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జునకు చైతన్య విడాకులు గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. చైతన్య గురించి ఇటీవల కాలంలో మీడియాలో వస్తున్న వార్తలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటూ ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ ప్రశ్నకు నాగార్జున సమాధానం చెబుతూ చైతన్య సమంత విడాకులు తీసుకోవడం వల్ల చైతన్య చాలా హ్యాపీగా ఉన్నాడు అది చాలు అంటూ సమాధానం చెప్పారు.

Nagarjuna: అదొక అనుభవంలా మిగిలిపోతుంది..
నాగచైతన్య సమంతతో విడిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఉండటాన్ని చూస్తున్నాను. ఈ విధంగా నాగచైతన్య కెరియర్లో పెళ్లి బ్రేక్ అవడం దురదృష్టమే అయితే అది ఒక అనుభవంలా ఉండిపోతుందని నాగార్జున వెల్లడించారు. ఈ విషయంపై మనం ఇంకా ఆలోచించడం సరైనది కాదు త్వరలోనే ఈ విషయాన్ని అందరూ మర్చిపోతారని భావిస్తున్నాను అంటూ నాగార్జున ఇలా నాగచైతన్య సమంత విడాకులపై స్పందించారు. కలిసి రోజు పోట్లాడుకోవడం కన్నా విడిపోయి హ్యాపీగా ఉండడమే ఉత్తమమని భావించి విడాకులు తీసుకున్నట్లు గతంలో కూడా నాగచైతన్య వెల్లడించారు. విడాకుల తర్వాత సమంత తాను ఇద్దరం హ్యాపీగా ఉన్నామని చైతన్య ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.































