Nagarjuna: సినీ నటుడు అక్కినేని నాగచైతన్య శోభిత వివాహం ఎంతో ఘనంగా జరిగింది. నిన్న రాత్రి 8:13 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ పెళ్లి సినీ సెలబ్రిటీలు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా అక్కినేని దగ్గుబాటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దగ్గుబాటి సురేష్ బాబు వెంకటేష్ కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే నాగార్జున ట్విట్టర్ వేదికగా నాగచైతన్య శోభిత పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ పోస్టు కూడా చేశారు. నాగచైతన్య శోభితల ఈ కొత్త ప్రయాణం మాకెంతో ప్రత్యేకం. నా ప్రియమైన చైతన్యకు శుభాకాంక్షలు ఇక మా ఇంట్లోకి అడుగు పెడుతున్న శోభితకు గ్రాండ్ వెల్కమ్ అంటూ చెప్పుకు వచ్చారు. నువ్వు అప్పుడే మా ఇంట్లో ఎంతో సంతోషాన్ని తీసుకువచ్చావు.

Nagarjuna: నాన్న విగ్రహం
ఇక ఈ ఏడాది మాకు ఎంతో ప్రత్యేక ఏఎన్ఆర్ గారి శత జయంతి వేడుకలు జరిగిన తర్వాత ఆయన విగ్రహం ముందు మీ వివాహం జరగడం ఎంతో స్పెషల్ అంటూ ఈ సందర్భంగా నాగార్జున నాగచైతన్య శోభిత పెళ్లి గురించి చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


























