అక్కినేని నాగచైతన్య సమంత ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు.ఈ క్రమంలోనే గత నాలుగు సంవత్సరాల నుంచి వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య పలు మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే వీళ్ళు విడిపోతున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై సమంత పరోక్షంగా అన్ని రూమర్లే అంటూ చెప్పడంతో అభిమానులు కాస్త సంబరపడ్డారు. అయితే వీరిద్దరు త్వరలో పిల్లలకోసం ప్లాన్ చేస్తున్నారనే శుభవార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అక్కినేని అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలువలేదనే చెప్పాలి.
తాజాగా సమంత నాగచైతన్య విడిపోతున్నారు అంటూ నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం విన్న అభిమానులకు కాస్త మింగుడు పడలేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే సమంత చైతన్య విడాకుల విషయంపై అక్కినేని నాగార్జున స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
???? pic.twitter.com/FGd33fFoIF
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2021
ఈ సందర్భంగా నాగార్జున స్పందిస్తూ భార్యాభర్తల మధ్య జరిగే వ్యక్తిగతం.. అంతర్గత అని తెలియజేశారు. అయితే సమంత తన ఇంటిలో ఉన్నన్ని రోజులు ఎంతో సంతోషంగా ఉండేదని, ఆ రోజులన్ని తనకు తీపిగుర్తులు గా ఉంటాయని, చైతు సమంత ఇద్దరూ అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ క్రమంలోనే వారిద్దరి ఎక్కడ ఉన్నా.. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు నాగార్జున తెలియజేశారు.
































