Nagarjuna: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగచైతన్య శోభిత పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆమెకు విడాకులు ఇవ్వడంతో తిరిగి శోభిత ప్రేమలో పడ్డారు. ఇక డిసెంబర్ 4వ తేదీ శోభిత నాగచైతన్య వివాహం జరగబోతోంది. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతున్న సంగతి తెలిసిందే.

ఇక అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా నటుడు నాగార్జున ఇటీవల ఒక ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని నాగచైతన్య శోభిత పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నాగార్జున వీరి పెళ్లి గురించి మాట్లాడుతూ..
నాగచైతన్య శోభిత వివాహాన్ని ఘనంగా జరిపించాలని చెప్పాను కానీ వాళ్ళిద్దరూ సింపుల్ గానే చేసుకోవాలని కోరడంతో వారి ఇష్ట ప్రకారమే సింపుల్గా ఏర్పాటన్ని చేయిస్తున్నానని తెలిపారు. ఇక వీరిద్దరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో జరగడం చాలా ఆనందంగా ఉంది. అది మాకు స్టూడియో మాత్రమే కాదు ఇంటితో సమానం అక్కడ నాన్న ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. అలాంటి చోట వీరిద్దరి పెళ్లి చేస్తే వారి జీవితం సంతోషంగా ఉంటుందని భావించి అన్నపూర్ణ స్టూడియోని వీరి పెళ్లి వేదికగా మార్చామని నాగార్జున తెలిపారు.

Nagarjuna: సాంప్రదాయంగా..
ఇక శోభిత నాగచైతన్య పెళ్లి విషయంలో శోభిత ఫ్యామిలీ మమ్మల్ని ఒకే ఒక్క విషయం కోరింది. వీరి వివాహం హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే జరగాలని కోరారు. మిగిలినది మీ ఇష్టం ఎలాగైనా చేసుకోండి అని చెప్పారు నేను కూడా ఇలా మంత్రోచ్ఛారణల మద్య వీరి వివాహం జరిపించాలని నిర్ణయం తీసుకున్నానని అలాంటి వివాహం మనసుకు కూడా ఎంతో ప్రశాంతత కలిగిస్తుందని అందుకే వీరి వివాహం హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగబోతుందని నాగార్జున తెలియజేశారు.
































