చైతూకు దూరంగా ముంబైకి షిఫ్ట్ అవుతున్న సమంత..? నాగార్జున ప్రయత్నాలు ఫలించలేదా?

0
717

ఏ మాయ చేసావే సినిమాతో పరిచయమైన సమంత, నాగచైతన్య ప్రేమగా మారింది. కొన్నాళ్లు ఇరువురి కటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరివురు విడిపోతున్నారని.. గొడవలు తారాస్థాయికి చేరడంతో విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ వాటిని సమంత గానీ, చైతు గానే ఏనాడు ఖండించలేదు. అందుకే సోషల్ మీడియాలో ఆ ఆరోపణలు బలాన్ని చేకూరుస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

సమంత ఫ్యామిలీ కంటే.. సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతుండటంతో చైతు సీరియస్ గా ఉన్నట్లు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరిని పెద్దలు కూర్చోబెట్టి రాజీ కుదిర్చినా కుదరలేదట. దీంతో విడాకుల మంజూరు కార్యక్రమం కూడా పూర్తి కావస్తుందనేది వార్తలు వస్తున్నాయి. అయితే ఇదిలా ఉండగా.. సమంత త్వరలోనే ముంబైకి షిఫ్ట్ కానుందట.

అక్కడకు వెళ్లి బాలివుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టనుందంటూ తెలుస్తోంది. విడాకులు మంజూరు కావడానికి కొంత సమయం పడుతుండటంతో.. తర్వాత అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే దీనిపై నాగార్జును ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అటు అఖిల్ కూడా ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయితో బ్రేకప్ కావడం.. నాగచైతన్య పరిస్థితి ఇలా కావడంతో బిగ్ బాస్ లో అతడు అంత జోష్ ఫుల్ గా కనిపించలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

లవ్ స్టోరీ ట్రైలర్ కు సంబంధించి నాగ చైతన్య ట్వీట్ చేయగా.. దానికి సమంత రీ ట్వీట్ చేసి.. ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పారు. దానికి థ్యాంక్యూ అంటూ సమంత ట్వీట్ కు చైతు రీ ట్వీట్ చేశాడు. అయితే సమంత కేవలం సాయిపల్లవి, లవ్ స్టోరీ టీంకు మాత్రమే యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్ చేయగా.. చైతన్యకు మాత్రం పెట్టలేదు. దీంతో అభిమానులు మరింత సందగ్ధంలో పడిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here