Namrata: మహేష్ బాబు భార్యగా, ఘట్టమనేని కోడలుగా, నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నమ్రత అందరికీ సుపరిచితమే. ఈమె 2000 సంవత్సరంలో మహేష్ బాబుతో కలిసి వంశీ సినిమాలో హీరోయిన్ గా నటించారు.ఇలా మహేష్ బాబుతో కలిసి తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే ఈమె మహేష్ బాబుతో ప్రేమలో పడ్డారు.

ఇలా దాదాపు 5 సంవత్సరాల పాటు రహస్యంగా ప్రేమ విషయాన్ని దాచిన ఈ జంట 25వ సంవత్సరంలో ఇంట్లో వారికి వీరి ప్రేమ విషయాన్ని తెలియజేసే చాలా సింపుల్ గా వీరి వివాహాన్ని చేసుకున్నారు. ఇకపోతే వివాహం అనంతరం నమ్రత సినిమాలకు దూరంగా ఉండి కేవలం ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా నమ్రత ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ…తాను మహేష్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకునే సమయంలోనే మా ఇద్దరి మధ్య ఒక డీల్ కుదుర్చుకొని పెళ్లి చేసుకున్నామని తెలిపారు.పెళ్లి చేసుకోవాలనుకునే సమయంలో తాను పెళ్లయిన తర్వాత సినిమాలలో నటించననీ ఒక సాధారణ గృహిణిగా ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చూసుకుంటానని మహేష్ బాబుతో చెప్పాను.

Namrata: నమ్రత పై ప్రశంసలు కురిపిస్తున్న మహేష్ ఫ్యాన్స్….
నేను చెప్పిన మాటలు విన్న మహేష్ కూడా చాలా సంతోషించారు. ఇలా మా ఇద్దరి మధ్య ఈ డీల్ కుదుర్చుకున్న అనంతరం మేము వివాహం చేసుకున్నామని ఈమె తాజాగా వారి పెళ్లి వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టారు.దీంతో నమ్రత చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో మహేష్ అభిమానులు ఘట్టమనేని కోడలు పై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఈమెను చూసి నేర్చుకోవాలని మరికొంతమంది హీరోయిన్లను టార్గెట్ చేస్తూ భారీగా ట్రోల్ చేస్తున్నారు.































