Namrata: పెళ్లికి ముందే నమ్రత ఆ హీరో ప్రేమలో పడ్డారా… అసలు విషయం ఏమిటంటే?

0
42

Namrata: నమ్రత శిరోద్కర్ పరిచయం అవసరం లేని పేరు.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటిగా కొనసాగిన నమ్రత అనంతరం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేమలో పడి ఆయనను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలుగా అడుగుపెట్టారు. ఈ విధంగా నమ్రత మహేష్ బాబును పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ. ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు.

ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి నమ్రత పెళ్లికి ముందు పలు బాలీవుడ్ సినిమాలలో నటించారు. అయితే తాజాగా నమ్రతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నమ్రత పెళ్లికి ముందే మరొక స్టార్ హీరోతో ప్రేమలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి. ఇలా అప్పట్లో నమ్రత గురించి ఇలాంటి వార్తలు వచ్చిన తరుణంలో ఈమెతో మహేష్ బాబు పెళ్లికి కృష్ణ ఒప్పుకోలేదట. ఈమె బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రేమలో పడ్డారంటూ ఓ వార్త సంచలనంగా మారింది.

ఇక సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలసి పలు సినిమాలలో కాస్త రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తే వారి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే నమ్రత విషయంలో కూడా ఇదే జరిగిందని తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించడంతో ఇలాంటి వార్తలు వచ్చాయి తప్ప అంతకుమించి ఏమీ లేదు.

Namrata: ఎందరికో ఆదర్శంగా నిలిచిన నమ్రత…


ఇక ఈమె తెలుగులో వంశీ సినిమాలో నటిస్తున్న సమయంలోనే మహేష్ బాబుతో ప్రేమలో పడటం అనంతరం తనని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం కావడం జరిగింది.ఇక మహేష్ బాబు నమ్రత వివాహం జరిగి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు నమ్రత ఎలాంటి వివాదాలకు పోకుండా తన పట్ల ఎలాంటి గాసిప్స్ రూమర్స్ రాకుండా ఎంతో చక్కగా ఒక బాధ్యతగల మహిళగా తన కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇలా నమ్రత ఈ విషయంలో ఎంతోమందికి స్ఫూర్తి అని చెప్పాలి.