Namrata shirodkar: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త తరహా సినిమాలను పరిచయం చేసిన ఘనత ఈయనకే చెల్లిందని చెప్పాలి. ఇలా కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి మహేష్ బాబు ఆయన కుమార్తె మంజుల కూడా అడుగుపెట్టారు.మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతుండగా మంజుల మాత్రం అడపా దడపా సినిమాలలో నటించారు.

ఇకపోతే మహేష్ బాబు వంశీ సినిమా షూటింగ్ సమయంలో నటి నమ్రత ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. పెళ్లి అనంతరం పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండి కేవలం కుటుంబ బాధ్యతలను మాత్రమే నిర్వర్తిస్తున్నారు. ఇలా పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా నిత్యం తనకు తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు.
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత మహేష్ బాబు సోదరి మంజుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ మంజులను తాను ఒక పార్టీలో మొదటిసారిగా కలిశానని తెలిపారు.అయితే అప్పటికి నేను మహేష్ బాబుని ప్రేమిస్తున్న విషయం తనకు తెలియదని, ఆ తరువాత తన ప్రేమ విషయం మంజులకు తెలియడంతో తాను తమ ప్రేమ పెళ్లి విషయంలో ఎంతో సపోర్ట్ చేశారని నమ్రత వెల్లడించారు.

Namrata shirodkar: మంజుల బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోయింది.
ఇకపోతే ఆ పార్టీలో ఏర్పడిన మా పరిచయం అనంతరం ఫ్యామిలీగా మారడమే కాకుండా తను నాకు బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోయిందని తనతో ఉన్న రిలేషన్ గురించి నమ్రత వెల్లడించారు. ఇక పిల్లల గురించి నమ్రత మాట్లాడుతూ మంజులకు అసలు పిల్లల్ని కనడం ఏ మాత్రం ఇష్టం లేదు.అయితే అనుకోకుండా ఇద్దరికీ ఒకే సారి ప్రెగ్నెన్సీ రావడం పిల్లల్ని కనడం జరిగిపోయిందని ఈమె తెలిపారు. ప్రస్తుతం తను ఒక కూతురికి తల్లిగా, ఎంతో ప్రేమతో తన కూతురు బాధ్యతలను చూసుకుంటూ సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నమ్రత మంజుల గురించి వెల్లడించారు. ప్రస్తుతం నమ్రత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































