నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దర్శక నిర్మాతలు ఈ సినిమాకు ఊహించిన దానికంటే రెట్టింపు రెస్పాన్స్ వస్తోంది. బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే సినిమా ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేక్షకులు ఊహించిన విధంగానే అఖండ సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు.

డిసెంబర్ 2న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా విజయం దిశగా దూసుకుపోతుంది. ప్రేక్షకులు, బాలయ్య ఫ్యాన్స్ అఖండ సినిమా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. చిత్ర యూనిట్ అదే జోష్ తో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బుల్లితెరపై బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనంఅందరికి తెలిసిందే.

తాజాగా అఖండ చిత్ర యూనిట్ ఈ షోకి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 10న స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ షోకి డైరెక్టర్ బోయపాటి శ్రీను, తమన్, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్ హాజరయ్యారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. బాలయ్య చిత్ర యూనిట్ తో కలిసి చిన్నపిల్లవాడిలా గంతులు వేస్తున్నారు. ప్రగ్యా అందమైన చీరలో మెరిసిపోయింది. బోయపాటి సార్.. బాలకృష్ణ సార్ అని ప్రగ్యా పిలుస్తుండటంతో.. సార్ సార్ ఏంటి బాలయ్య అని పిలువు అని అనగా.. వెంటనే ఓకే బాలా అని అనేసింది ప్రగ్యా జైస్వాల్.

ఇక ఈ ప్రోమో చివర్లో బాలయ్య ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. తన తండ్రి ఎన్టీఆర్ కి జరిగిన వెన్నుపోటు ఘటన పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక తప్పుడు ప్రచారం జరుగుతోంది.వెన్నుపోటు పొడిచారని అన్నారు. దీని గురించి మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. నేను ఆయన కొడుకుని అంతేకాక అభిమానుల్లో, ఒకడిని అని చెబుతూ బాలయ్య ఎమోషనల్ అయ్యారు. ఇక శ్రీకాంత్ బోయపాటి అలా ఎమోషనల్ గా చూస్తూ ఉండిపోయారు. ఈ వెన్నుపోటు సంఘటన గురించి బాలయ్య ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అన్నది తెలియాలి అంటే డిసెంబర్ 10 వరకు ఆగాల్సిందే.
































