Nandita Swetha: సాధారణంగా సోషల్ మీడియాలో హీరోయిన్స్ గురించి నెటిజన్లు ట్రోలింగ్ చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఎంతోమంది నటీమణులు ఈ విధమైనటువంటి ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటారు.అయితే కొందరు ఇలాంటి విషయాల గురించి చూసీచూడనట్టు వెళ్ళిపోతుండగా మరికొందరు మాత్రం సదరు నెటిజన్లకు ధీటుగా సమాధానం చెబుతుంటారు.

ఈ క్రమంలోనే నటి నందితా శ్వేత విషయంలో కూడా ఇలాంటిదే చోటు చేసుకుంది. నటి నందితా శ్వేత సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఎంతోమంది నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేయగా ఒక నెటిజన్ మాత్రం ఆమె బాడీ షేమింగ్ గురించి కామెంట్ చేశారు.

గ్రే కలర్ స్లీవ్లెస్ టీ షర్ట్ ధరించి ఉన్న ఫోటోని షేర్ చేయగా ఒక నెటిజన్ ఈ ఫోటో పై స్పందిస్తూ… ప్లీజ్ మీ శరీరంపై శ్రద్ధ పెట్టండి. మీ షేప్స్ చూసుకోండి ఒకసారి ఆంటీలా తయారవుతున్నారు. వర్కౌట్స్ చేయండి అంటూ కామెంట్ చేశారు.ఈ విధంగా సదరు నెటిజన్ కామెంట్ చేయడంతో ఈ కామెంట్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేనేమైనా దేవతనా…
ఈ క్రమంలోనే సదరు నెటిజన్ చేసిన కామెంట్ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… ఇలాంటి వాళ్ళతో ఎంత నరకం మనుషులలో కూడా ఇలాంటి వారు ఉంటారా…. నేను ఏమైనా దేవతన నాకు కూడా ఎన్నో బాధలు ఉంటాయి. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతారు నేను ఏవిధంగా ఉన్న నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను. నేను ఎప్పుడు ఎలా కనపడతానో అలా ఉండడానికి ఇష్ట పడతాను అంటూ నెటిజెన్ చేసిన కామెంట్ కు నందిత శ్వేత రిప్లై ఇచ్చారు. ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే ఇటీవల ఐపీసీ 376 అనే సినిమాలో నటించిన నందిత పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.































