Nara Brahmani: బాలయ్య కుమార్తెగా నందమూరి ఆడపడుచుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రాహ్మణి నారావారి ఇంట కోడలుగా అడుగు పెట్టింది.ఇలా బాలయ్య కుమార్తెగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బ్రాహ్మణి వివాహం అనంతరం వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు.

ఈమె హెరిటేజ్ ఫుడ్ సంస్థను ఎంతో విజయవంతంగా ముందుకు నడుపుతూ మహిళా పారిశ్రామికవేత్తగా పేరు ప్రఖ్యాతలు పొందారు.అదేవిధంగా తనదైన శైలిలో పలుసేవ కార్యక్రమాలను కూడా చేస్తూ ఈమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే నారా బ్రాహ్మణి కేవలం వ్యాపారవేత్తగా వరకు మాత్రమే మనకు తెలుసు.
మనకు తెలియని మరో యాంగిల్ బ్రాహ్మణిలో దాగి ఉందని తాజాగా బయటపడింది. ఈమెకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టమట. ఇలా ప్రొఫెషనల్ బైక్ రైడింగ్ గ్రూప్లో కూడా ఈమె మెంబర్ గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె లడక్ హిల్ స్టేషన్ ఏరియాలో బైక్ రైడింగ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Nara Brahmani: బైక్ రైడింగ్ అంటే బ్రాహ్మణికి ఇంత పిచ్చా…
జావా యజ్దీ స్పోర్ట్స్ బైక్ పై లేహ్ లడక్ లాంటి ప్రాంతాలలోబైక్ రైడింగ్ చేసినటువంటి వీడియో వైరల్ అవ్వడమే కాకుండా ఈ రైడింగ్ విశేషాలను అనుభూతులను కూడా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం బ్రాహ్మిని షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో ఈ వీడియో చూసినటువంటి ఎంతోమంది అభిమానులు బ్రాహ్మణిలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.































