Nara Brahmani: తండ్రి అంటే బ్రాహ్మినికి అంత ప్రేమనా… ఇప్పటికీ తండ్రి కోసం అలా చేస్తుందా?

0
53

Nara Brahmani: నారా బ్రాహ్మణి పరిచయం అవసరం లేని పేరు నందమూరి ఆడపడుచుగా నారావారి కోడలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె బిజినెస్ రంగంలో దూసుకుపోతూ బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ సాధించారు. ఇలా వ్యాపార రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి బ్రాహ్మిని సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా ముందుంటారు.

ఈ క్రమంలోనే బ్రాహ్మినికి సంబంధించినటువంటి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా స్టార్ డాటర్ అయినటువంటి ఈమె, ఒక పొలిటీషియన్ కోడలిగాను అలాగే వ్యాపారవేత్తగాను భారీగానే సంపాదించారు. అయితే ఈమె ఖర్చు చేయాలి అనుకుంటే ఏమాత్రం వెనకాడకుండా తన జీవితాన్ని ఎంతో స్వేచ్ఛగా గడపవచ్చు కానీ బ్రాహ్మణి మాత్రం అలా ఎప్పుడూ చేయరట.

కాలేజీ చదువుతున్న సమయంలోనే తన వద్ద డబ్బు ఉంటే ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయకుండా ఆ డబ్బును పేదవారికి పంచే గుణం బ్రాహ్మణిలో ఉందని చెప్పాలి.ఇక ఈమె కాలేజీలో చదువుతున్నప్పటినుంచి కూడా తన తండ్రి పట్ల ఎంతో ప్రేమను చూపించేవారు తన తండ్రి పుట్టిన రోజు కనుక వచ్చిందంటే చాలు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసేవారట. అయితే అందరిలాగా కేక్ కట్ చేసి ఫ్రెండ్స్ కి పార్టీలు ఇవ్వకుండా అనాధ పిల్లల కోసం పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేసే వారిని తెలుస్తుంది.

Nara Brahmani: అనాధ పిల్లలకు అన్న దానం….

తన తండ్రి పుట్టిన రోజు కనుక వస్తే చాలు బ్రాహ్మిని పేద పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టడమే కాకుండా వారి అవసరాలను కూడా తీరుస్తారట.అయితే ఇప్పటికి ఈమె ఇదే పనిని ఆచరిస్తూ ఉన్నారని బ్రాహ్మిని గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఇలా బ్రాహ్మణి గురించి ఈ వార్త తెలియడంతో తండ్రి అంటే తనకు ఎంత ఇష్టం ఉందో అర్థమవుతుంది. ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఈమె మంచి మనసు పై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆమె పెంపకం అలాంటిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.