Narendra Modi: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు రాజకీయ రంగానికి చెందిన వారి బయోపిక్ చిత్రాల పాటు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారి బయోపిక్ చిత్రాలు ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాయి.

ఈ క్రమంలోనే ముచ్చటగా మూడోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ చిత్రం కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రధానమంత్రిగా 10 సంవత్సరాల పాటు పనిచేసి ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టారు. ఇక మూడోసారి కూడా ప్రధానమంత్రిగా ఈయన బాధ్యతల స్వీకరించారు.
దేశ రాజకీయాలలో ఎంతో కీలక పాత్ర పోషించిన నరేంద్ర మోడీ బయోపిక్ సినిమా చేయడం కోసం డైరెక్టర్ సి.హెచ్ క్రాంతి కుమార్ అని ఏర్పాట్లు సిద్ధం చేశారని తెలుస్తుంది. ఇక నరేంద్ర మోడీ బయోపిక్ చిత్రానికి విశ్వనేత అనే టైటిల్ కూడా ఖరారు చేశారని తెలుస్తుంది.
భారత ప్రధాని..
వందే మీడియా ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య పాత్రలలో నటించబోతున్నారు.ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలోనే షూటింగ్ జరుపుకోబోతోంది. ఆర్టికల్ 370 రద్దు, డిమోనిటైజేషన్, జి.ఎస్.టి, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న మోడీ బయోపిక్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం కానుంది.


































