Naresh: అమ్మలాంటి అమ్మాయిని కలిసాను… నటుడు నరేష్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

0
17

Naresh: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పవిత్ర లోకేష్ నరేష్ అనే చెప్పాలి. వీరిద్దరూ విజయకృష్ణ మూవీస్ బ్యానర్ ద్వారా మళ్ళీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో వారి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీరిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నరేష్ తన తల్లి విజయనిర్మలను గుర్తు చేసుకొని ఎమోషనల్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తల్లి ఎవరికో మంచి చేయడానికి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు. అయితే పెళ్లి వల్ల ఎవరికి మంచి జరగలేదు.

మరోసారి నా జీవితంలో మంచి చేయాలని నిర్ణయం తీసుకుంటే ఆ కోరిక కూడా తీరలేదని తెలిపారు. మరోసారి మంచి చేయాలని అమ్మ భావించగా మంచి కన్నా చెడే ఎక్కువగా జరిగిందని నరేష్ తెలిపారు. మా అమ్మ చివరిగా నాతో మాట్లాడుతూ నిన్ను రాజును చేశాను కానీ నీకు మంచి జీవితం ఇవ్వలేకపోయాను అంటూ తన తల్లి ఎంతో బాధపడిందని నరేష్ తెలిపారు. నా రీల్ జీవితం చాలా బాగా కొనసాగింది కానీ రియల్ జీవితం ఏమాత్రం సంతోషంగా సాగలేదని తెలిపారు.

Naresh: నా జీవితం చివరి గమ్యానికి చేరుకుంది…


ఇక అమ్మ నా గురించి మాట్లాడుతూ ఉండగా నువ్వేం బాధపడకమ్మా అమ్మ తర్వాత నాకు మరో అమ్మ లాంటి అమ్మాయి దొరికింది అంటూ ఈయన పవిత్ర లోకేషన్ చూపిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పవిత్రతో నా పరిచయం ఏర్పడిన తర్వాత నా జీవితం చివరి గమ్యానికి చేరుకున్నాను అన్న నమ్మకం ఎక్కువైంది అంటూ ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.