Naresh -Pavitra Lokesh: నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన కామెడీ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తన వ్యక్తిగత విషయాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

ముఖ్యంగా ఈయన నటి పవిత్ర లోకేష్ తో పెట్టుకున్నటువంటి రిలేషన్ ఎన్నో వివాదాలకు కారణమైంది. అయితే డిసెంబర్ 31 2022వ తేదీ వీరిద్దరూ లిప్ లాక్ పెట్టుకున్నటువంటి వీడియోని షేర్ చేయడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి తేదీని కూడా ప్రకటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వీడియో పై స్పందించిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకోగా ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు. ఇక మూడవ భార్య రమ్య రఘుపతికి ఇప్పటివరకు విడాకులు ఇవ్వలేదు కనుక ఆయన ఈమెకు విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవడానికి కుదరదు.అయితే రమ్య రఘుపతి మాత్రం తనకు నరేష్ కు ఒక సంతానం ఉన్నారని తన కొడుకుకు తండ్రి అవసరం ఉంది అంటూ ఆమె విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు.

Naresh -Pavitra Lokesh: సినిమా ప్రమోషన్ లో భాగమే…
ఇలా నరేష్ మూడవ భార్యకు విడాకులు ఇవ్వకపోయినప్పటికీ ఈయన పవిత్ర లోకేష్ తో కలిసి లిప్ లాక్ చేసినటువంటి వీడియోని ఎందుకు షేర్ చేశారనే విషయానికి వస్తే ఇది ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగానే ఈ వీడియోని షేర్ చేశారని తెలుస్తుంది. నరేష్ పవిత్ర లోకేష్ జంటగా .యస్.రాజు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా నరేష్ ఈ వీడియోని షేర్ చేశారని ఇక ఈ సినిమాకి కూడా ‘గుడ్ న్యూస్’ అనే టైటిల్ ను ఖరారు చేయబోతున్నారని అందుకే పవిత్ర నరేష్ కూడా ఆ వీడియోకి గుడ్ న్యూస్ అని క్యాప్షన్ పెట్టారని తెలుస్తోంది. అయితే త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.


































